గ్లామర్ నటి నమిత టైటిల్ పాత్రలో, రాజా-మీరా చోప్రా జంటగా మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్.మురళి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'జగన్మోహిని'. ఎస్.కె.విశ్వనాథ్ దర్శకుడు. దసరా కానుకగా గత నెల 25న ఈ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల విడుదల తేదీని మార్చారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు నిర్మాత తెలిపారు.పాతికేళ్ల క్రితం బి.విఠలాచార్య దర్శకత్వంలో సంచనల విజయం సాధించిన 'జగన్మోహిని' చిత్రానికి మోడ్రన్ వెర్షన్ గా ఈ చిత్రం రూపొందిందని నిర్మాత తెలిపారు. ఒరిజినల్ వెర్షన్ స్టోరీలైన్ మాత్రమే తీసుకుని ఇవాల్టి జనరేషన్ కు తగ్గట్టుగా అత్యుత్తమ సాంకేతిక విలువలు, గ్రాఫిక్ వర్క్ తో ఎక్కడా ఖర్చుకు రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చెప్పారు. మూడు ఐలాండ్స్ లో సెట్స్ వేసి తీశామనీ, అండమాన్ దగ్గర సముద్రంలో తీసిన అండర్ వాటర్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని అన్నారు. సినిమా ఓపినింగ్ సన్నివేశాలే చాలా గ్రాండ్ గా ఉండి ప్రేక్షకులను సినిమాలో పూర్తిగా ఇన్ వాల్వ్ చేస్తాయన్నారు. టైటిల్ పాత్రకు నమిత ఒక్కరే సరిపోతారనీ, అందుకోసమే ఆమెను ఎంచుకున్నామనీ, ఆమె నటన, గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని అన్నారు. హ్యాండసమ్ రాకుమారుడిగా రాజాను ఈ చిత్రంతో తమిళ పరిశ్రమకు కూడా పరిచయం చేస్తున్నామని అన్నారు. రాకుమారిగా మీరాచోప్రా, మాంత్రికుడిగా కోట శ్రీనివాసరావు నటన, ఆలీ కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. ఇళయరాజా సంగీతం అందించిన ఆడియోకి, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరసింహరాజు, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.
No comments:
Post a Comment