'యంగ్ ఇండియా' ప్రీ ప్రొడక్షన్

డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించనున్న 149వ చిత్రం 'యంగ్ ఇండియా'. శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం నూతన నటీనటుల ఎంపిక పూర్తి కావచ్చింది. ఆంతా కొత్త వారితో తెరకెక్కించనున్న ఈ చిత్రం కోసం నూతన నటీనటులు కావలెనంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనకు విశేష స్పందన లభించింది. మరోవైపు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది.రామకృష్ణ ప్రసాద్ ఆ విశేషాలను తెలియజేస్తూ, మొత్తం 22,000 అప్లికేషన్సు రాగా, 640 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశామనీ, వారి నుంచి 60 మందిని కమెడియన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, ఇతర పాత్రల కోసం ఎంపిక చేసినట్టు తెలిపారు. హీరో-హీరోయిన్లు, సపోర్టింగ్ హీరో హీరోయిన్లు, విలన్ పాత్రల కోసం జరిగిన ఎంపికలో 29 మందిని సెలక్ట్ చేశామన్నారు. 20 మంది బాయ్స్, 9 మంది గర్ల్స్ తో కూడిన ఈ బ్యాచ్ కు నెలరోజుల పాటు డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలవరీ, బాడీ లాంగ్వేజ్, స్టయిలింగ్ వంటి అంశాల్లో కఠోర శిక్షణ ఇచ్చామన్నారు. ఈనెల 6.7,8 తేదీల్లో రామోజీ ఫిలిం సిటీలో స్క్రీన్ టెస్ట్ లు నిర్వహించి ఫైనల్ బ్యాచ్ ను ఎంపిక చేస్తామని అన్నారు. ఎంపికైన ఆర్టిస్టులలో 'యంగ్ ఇండియా' చిత్రంలోని పాత్రలకు సరపడని వారు ఉంటే వారికి తమ తదుపరి చిత్రంలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. కీరవాణి సంగీత సారథ్యంలో 6 పాటల రికార్డింగ్ పూర్తయిందనీ, స్క్రిప్టు సిద్ధంగా ఉందనీ చెప్పారు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.

No comments:

Post a Comment