వరద బాధితులను ఆదుకోవడంలో హీరో ఎన్టీఆర్ తన తోటి కళాకారులకు సైతం ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రాన్ని అతలాకుతులం చేసిన వరద బీభత్సాన్ని చూసి చలించిన ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రోశయ్యకు మంగళవారంనాడు అందజేశారు. సరిగ్గా 24 గంటలు కూడా తిరగక ముందే బుధవారంనాడు మరో 20 లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ఎన్టీఆర్ ట్రస్టుకు అందజేశారు. దీంతో ఆయన అందించిన విరాళం మొత్తం రూ.40 లక్షలకు చేరింది.ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్టీఆర్ నేరుగా విరాళం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మంగళవారంనాడు కొద్దిపాటి చర్చకు దారితీసింది. తెలుగుదేశం తరఫున విరాళాలు ఎన్టీఆర్ ట్రస్టుకు ఇవ్వాల్సిందిగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ తన విరాళాన్ని సిఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వడం ఏమేరకు సబబనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మరో 20 లక్షల రూపాయల చెక్కును ఎన్టీఆర్ ట్రస్టుకు ఇచ్చారు. చంద్రబాబునాయుడును పార్టీ కార్యాలయంలో కలిసి ఆ చెక్కును ఎన్టీఆర్ అందజేశారు. బాలకృష్ణ సైతం 20 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ఎన్టీఆర్ ట్రస్టుకు ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం రామ్ చరణ్ 10 లక్షలు, డి.రామానాయుడు 10 లక్షలు, ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ 5 లక్షలు ముఖ్యమంత్రి రోశయ్యకు అందించారు. అల్లు అర్జున్ 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవికి అందజేశారు. తమిళ నటుడు సూర్య 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు
No comments:
Post a Comment