అనుష్కకు వీసా 'నో'

'అరుంధతి' చిత్రం తర్వాత నటి అనుష్క జాతకమే మారిపోయింది. మహేష్ 'ఖలేజా' (పేరు ఖరారు కావాల్సి ఉంది), దర్శకుడు క్రిష్ 'వేదం', రవితేజతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ చిత్రం ఆమె చేతిలో ఉన్నాయి. 'అరుంధతి' తమిళ అనువాదం కూడా మంచి సక్సెస్ చవిచూడటంతో అక్కడ కూడా ఆమెకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన 'వెట్టైకారన్' అనే చిత్రంలో ప్రస్తుతం అనుష్క నటిస్తోంది. దీపావళికి ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అనూహ్యంగా తలెత్తిన ఓ సమస్యతో విడుదుల తేదీ వాయిదా పడే పరిస్థితి తలెత్తింది. ఆస్ట్రేలియాలో షూటింగ్ కు అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో చిత్రయూనిట్ కు వీసా నిరాకరించడంతో అసలు సమస్య తలెత్తింది.విజయ్-అనుష్కపై ఆస్ట్రేలియాలో ఓ కీలమైన సాంగ్ కోసం చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే చివరి నిమిషంలో కారణాంతరాల వల్ల వీసా నిరాకరించారు. దీంతో దర్శకుడు వేరే లొకేషన్ ను ఎంపిక చేయక తప్పలేదు. ప్రస్తుతం పుణెలో ఆ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అదే ప్లేస్ లో రజనీకాంత్-నయనతారపై 'బల్లెలక్క' అనే పాటను 'శివాజీ' చిత్రం కోసం గతంలో చిత్రీకరించారు. ప్రస్తుతం పుణెలో జరుగుతున్న సాంగ్ చిత్రీకరణ తర్వాత విజయ్ - బాలీవుడ్ డాన్సర్లపై ముంబైలో మరో పాట చిత్రీకరణ ఉంటుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రం తర్వాత విజయ్ 50వ సినిమాగా 'సూర' ఉండబోతోంది. కొసమెరుపు ఏమిటంటే ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా 'హ్యాపీడేస్ ' ఫేమ్ తమన్నా ఎంపికైంది. 90 లక్షల పారితోషికమట

No comments:

Post a Comment