మెస్మరైజ్ చేసే మిడిల్ ఏజ్డ్ పాత్రలు చేయాలంటే హైద్రాబాద్ ముద్దుగుమ్మ టబూ గుర్తొస్తుంది. 'ఇదీ సంగతి'లో మధ్యతరగతి గృహిణుల మనస్థత్వానికి అద్దంపట్టే పాత్రలోనూ, 'పాండురంగడు'లో వారకాంత పాత్రలోనూ టబూ ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. అయితే టబూకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాగా 'నిన్నే పెళ్లాడతా'ను చెప్పొచ్చు. 'గ్రీకువీరుడు...నా రాకుమారుడు' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన టబూ ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది. అప్పట్నించీ ఇద్దరి మధ్యా 'ఆఫ్ స్క్రీన్' కెమెస్ట్రీ నడుస్తోందనే ప్రచారం మొదలైంది కూడా. నాగార్జున సైతం టబూ పట్ల ప్రత్యేక అభిమానం చూపుతుంటారు. 'టబూ నాకు బాగా దగ్గరైన మనిషి' అని నాగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఈమధ్యనే ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో టబూ బుగ్గపై నాగార్జున ముద్దుపెట్టుకోవడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.నాగ్ తో అనుబంధం గురించి టబూ తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ 'చాలా ఏళ్లుగా జనం మా గురించి ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తూనే ఉన్నారు. ఆ డిటైల్స్ లోకి మాత్రం వెళ్లదలచుకోలేదు. మీరు చూసే దానిలోనే సమాధానం ఉంది' అంటూ నవ్వుతూ చెప్పింది. మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తారని అడిగినప్పుడు...నాగ్ తో మళ్లీ ఓ సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నాననీ, ఆయనతో నటించడమంటే ఓ పిక్నిక్ లాగా ఉంటుందనీ చెప్పుకొచ్చింది. నాగ్ తో నటిస్తున్నాంటే మా కాంబినేషన్ మీద మంచి అంచనాలు ఉంటాయనీ, అందుకు తగ్గ స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాననీ మరోసారి నాగ్ పట్ల తనకున్న అభిమానం చాటుకుంది. నాగ్-టబూ స్క్రీన్ కెమెస్ట్రీ మరోసారి చూడాలని అనుకునే వాళ్లకు కూడా కొదవలేదు. మరి నాగ్ ఏమంటారో?!
No comments:
Post a Comment