'ఏకనిరంజన్' పాటలు హిట్

ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయనీ, ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ నిర్మాత ఆదిత్యరామ్ తెలిపారు. ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.

మణిశర్మ సంగీతం అందించిన పాటలు పెద్ద హిట్ కావడంతో పాటు వీటన్నింటినీ పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించినట్టు ఆదిత్యరామ్ చెప్పారు. సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ గా వచ్చే 'ఏక్ నిరంజన్' పాటను 3 కోట్ల వ్యయంతో భారీ సెట్ లో చిత్రీకరించామనీ, 'గుండెల్లో గిటారు మ్రోగించవే...'అంటూ వచ్చే రెండో పాటను స్విట్జర్లాండ్ లో హీరోహీరోయిన్లపై చిత్రీకరించారమనీ, 'సమీరా సమీరా..' అనే మూడో పాటను హైద్రాబాద్ లోని డిఫరెంట్ లొకేషన్లలో తీశామనీ చెప్పారు. నాలుగో సాంగ్ గా 'మహహమ్మారి..మహమ్మారి..అందాల మహమ్మారి'ను అన్నపూర్ణా స్టూడియోస్ లోని ప్రత్యేక సెటల్ హీరో-హీరోయిన్-వెస్ట్రన్ డాన్సర్లపై చిత్రీకరించామని చెప్పారు. 'ఎవరు లేరని అనకు...' అనే ఐదో పాటను హైద్రాబాద్ లో, 'అరెరే..నర్తనతార' అనే పాటను మైకేల్ జాక్సాన్ కు నివాళిగానూ చిత్రీకరించినట్టు తెలిపారు. పాటలతో పాటు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందనీ, ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు నటిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరీ జగన్నాథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

No comments:

Post a Comment