సిద్దార్ధ, గోపీచంద్ విరాళం

రాష్టాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో బాధితుల కడగండ్లు చూసి యావత్ చిత్ర పరిశ్రమ చలించిపోతోంది. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ఎవరికి తోచిన సహాయంతో వారు ముందుకొస్తూ 'మాట్లాడే పెదవుల కంటే సాయం అందించే చేతులే మిన్న' అని చాటుకున్నారు. యువహీరోలు సిద్దార్ధ, గోపీచంద్ చెరో 5 లక్షల రూపాయలను వరద బాధితుల సహాయార్థం గురువారంనాడు సిఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ముఖ్యమంత్రి రోశయ్య ను సచివాలయంలో కలిసి చెక్ రూపంలో ఈ సహాయాన్ని వారిరువురూ అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన తరుణమిదనీ, ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయం చేసి వారికి అండగా నిలవాలనీ వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

యువహీరోలు రామ్ చరణ్ 10 లక్షలు, ఎన్టీఆర్ 40 లక్షలు, బాలకృష్ణ 20 లక్షలు, డి.రామానాయుడు 10 లక్షలు, అల్లు అర్జున్ 5 లక్షలు, సూర్య 5 లక్షలు, నిర్మాత వెంకట్ 5 లక్షలు వరద బాధితుల సహాయార్థం అందించారు. బ్రహ్మానందం, డాక్టర్ రాజశేఖర్-జీవిత దంపతులు వరద బాధిత ప్రాంతాల్లో ఆహార, వస్తు సరఫరాతో ఆదుకుంటున్నారు. సీనియర్ నటి జమున సైతం 15 క్వింటాళ్ల బియ్యాన్ని వరద బాధిత ప్రాంతాలకు గురువారంనాడు పంపారు

No comments:

Post a Comment