ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలైనా ఇద్దరి మధ్యా ఉన్న స్నేహబంధం ముచ్చట గొలుపుతుంటుంది. రామ్ చరణ్ (చెర్రీ), అల్లు అర్జున్ (బన్నీ) మధ్య ఇలాంటి మంచి అండర్ స్టాండింగ్ కనిపిస్తుంటుంది. చెర్రీ పుట్టినరోజు విదేశాల్లో జరిగితే బన్నీ అక్కడకు ల్యాండ్ అయిపోతుంటాడు. 'మగధీర' సినిమాతో మరో 30-40 ఏళ్ల వరకూ చెర్రీనే సూపర్ స్టార్ గా ఏలుతాడంటూ బన్నీ ఇటీవల బల్లగుద్ది మరీ చెప్పారు. మరోవైపు వరద బాధితుల సహాయార్థం రామ్ చరణ్ 10 లక్షల రూపాయలు తక్షణ సహాయంగా సిఎం నిధికి విరాళంగా ఇస్తే, అల్లు అర్జున్ సైతం అదే బాటలో పిఆర్ పి అధినేత చిరంజీవికి 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే. తాజాగా చరణ్ 'మగధీర' అప్రతిహతంగా 100 రోజులు పూర్తి చేసుకునేందుకు కూడా అల్లు అర్జున్ రూట్ క్లియర్ చేశారు.అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో ఆదిత్యబాబు, బివిఎస్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆర్య-2' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 11, 13 తేదీల్లో ఏదో ఒకరోజు రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ తాజాగా నిశ్చయించింది. 'మగధీర' 100 రోజులకు అడ్డులేకుండా ఉండేందుకే 'ఆర్య-2' సైడయ్యారని సమాచారం. 'మగధీర' చిత్రం ఇప్పటికే 302 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించింది. నవంబర్ 2వ తేదీతో సెంచరీ కూడా పూర్తి చేసుకోనుంది. ఈ తరుణంలో 'ఆర్య-2' విడుదలైతే కొన్ని థియేటర్ల నుంచి 'మగధీర' కనుమరుగవుతుంది. దీనికితోడు కొన్ని ఏరియాల్లో 'మగధీర' డిస్ట్రిబ్యూటర్లే 'ఆర్య-2'ను కూడా దక్కించుకున్నారు. ఈ పరిణాలను దృష్టిలో పెట్టుకునే 'ఆర్య-2' ఓ అడుగు వెనక్కి వేశాడు. 'మగధీర' సెంచరీ పూర్తయిన వెంటనే 'ఆర్య-2' పరుగు మొదలవుతుందన్నమాట...
No comments:
Post a Comment