హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు పారితోషికం చాలా తక్కువగా ఉంటుందనేది ఒకప్పటి మాట. ఇవాల్టి నవతరం హీరోయిన్లు పలువురుహీరోలకు దాదాపు సమానంగా, ఒక్కోసారి హీరోల కంటే ఎక్కువగా కూడా పారితోషికం అందుకుంటూ ఓ వెలిగి వెలిగిపోతున్నారు. ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో నటిస్తూ ద్విభాషా హీరోయిన్లు అనిపించుకుంటున్న వారికైతే ఆకర్షణీయమైన రెమ్యునరేషన్లు అందుతున్నాయి. నిజానికి రెండు మూడేళ్ల క్రితం వరకూ హీరోయిన్లకు ఇచ్చే అత్యధిక పారితోషికం 40 నుంచి 50 లక్షల వరకే ఉండేది. ఇప్పుడు డిమాండ్ లో ఉన్న హీరోయిన్లు రెట్టింపు పారితోషికం అందుకుంటూ కోటి రూపాలయను టచ్ చేస్తున్నారు. త్రిష రెమ్యునరేషన్ పరంగా తమిళంలో 80 లక్షలు, తెలుగులో 1.10 (టాక్స్ చెల్లింపు తర్వాత) కోట్లు అందుకుంటోందని సమాచారం. నయనతార ఇక్కడ 70, తమిళంలో 85 లక్షలు అందుకుంటోంది. శ్రియకు ఒక కోటి ఇస్తున్నారని అంటున్నప్పటికీ ఆమె మాత్రం ఎప్పుడూ ఆ అంకె తాను వినలేదని చెబుతోంది. కాకుంటే కాస్త అటూఇటూగా ఆ రెమ్యునరేషన్ ఉంటుందని మాత్రం స్పష్టం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళనాట త్రిషకు గట్టి పోటీ ఇస్తున్న తమన్నా అక్కడ పారితోషికం పరంగా కూడా త్రిషను దాటేసిందట.తెలుగులో 'హ్యాపీడేస్'తో తమన్నాకు మంచి పేరు వచ్చినా ఎందుకో అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే తమిళంలో మాత్రం తమన్నాకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. అగ్రహీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలతో ఇప్పుడు తమన్నా నటిస్తోంది. హాటెస్ట్ సమాచారం ప్రకారం తమిళంలో స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ 50వ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది.'సూర' పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి గాను తమన్నాకు 90 లక్షలు చెల్లించారట. అంటే తమిళలో త్రిష తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఓ 10 లక్షలు ఎక్కువ. ఇక్కడితో తమన్నా స్పీడ్ తగ్గలేదు. పద్మశ్రీ కమల్ హాసన్- దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి రానున్న కొత్త చిత్రానికి కూడా తమన్నా పేరు పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్ట్ తమన్నా చేతిలో పడితే కోటి రూపాయల పారితోషికాన్ని టచ్ చేసినట్టే
No comments:
Post a Comment