'కిక్' చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన శ్యామ్ కు ఆ చిత్రం మంచి పేరు తెచ్చింది. తాజాగా శ్యామ్ హీరోగా 'వీడు మనవాడే'పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై సి.విజయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేతాజీ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోస్ లో జరుగుతోంది. సెట్స్ లోనే చిత్రయూనిట్ బుధవారంనాడు ఆ విశేషాలను తెలియజేసింది.దర్శకుడు నేతాజీ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నామనీ, తమిళ వెర్షన్ ఇటీవలే విడుదలైందనీ చెప్పారు. తెలుగు వెర్షన్ కొద్దిరోజుల క్రితమే పూర్తి కావలసి ఉన్నప్పటికీ తమిళంలో మరో చిత్రానికి తాను అంగీకరించడంతో ఆ సినిమాకి పనిచేయాల్సి వచ్చిందనీ, ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా షూటింగ్ చేస్తున్నామనీ చెప్పారు. కులుమనాలి, చెన్నై, మహాబలేశ్వరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని చెప్పారు. ఇందులో తాను ఫిషర్ మన్ గా నటిస్తున్నట్టు శ్యామ్ తెలిపారు. ఈ చిత్రం తెలుగులో తనకు మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. శ్యామ్ కు జోడిగా మల్లికాకపూర్, ఇతర పాత్రల్లో విజయభాస్కర్, రామిరెడ్డి, సైరాభాను, వేణుమాధవ్, రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. లతా నేతాజీ మాటలు, గాదిరాజు శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, ఆనంద్ ఫైట్స్ అందిస్తున్నారు.
No comments:
Post a Comment