వరదబాధితులకు జీవిత,డాక్టర్ రాజశేఖర్ సాయం

వరదబాధితులకు సాయం చేయటానికి మానవతా వాదులంతా ముందుకొస్తున్నారు. వారిలో సినీ నటులు రామ్ చరణ్ తేజ, జూనియర్ యన్.టి.ఆర్., రామోజీరావు, బ్రహ్మానందంలతో పాటు డాక్టర్ రాజశేఖర్ ‍, శ్రీమతి జీవిత రాజశేఖర్‍లు కూడా ముందుకు వచ్చారు. వారిరువురు కలసి ముంపునకు గురైన ఆలంపూర్ లో అక్కడున్న ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల్ని అందజేశారు.వాటితో పాటుగా అక్కడి ప్రజల ఆరోగ్యానికి అవసరమైన మందులను కూడా వారు తమ ఫౌండేషన్ తరపున పంపిణీచేశారు. వీరు కూడా ప్రజలంతా ఈ విపత్కర సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment