మగధీర' ఛారిటీ షో...

రామ్ చరణ్ 'మగధీర' చిత్రం అప్రహతిహతంగా 100 రోజులకు చేరువవుతున్న తరుణంలో ఆ చిత్రం ద్వారా ఒకరోజు వచ్చే కలెక్షన్ ను వరద బాధితుల సహాయార్థం అందచేయాలని ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 'మగధీర' చిత్రం ప్రదర్శిస్తున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదించిన అనంతరం తన నిర్ణయాన్ని అల్లు అరవింద్ ప్రకటించారు. ఈ ఆదివారం 'మగధీర' చిత్రం ద్వారా వచ్చే కలెక్షన్ ను వరద బాధితుల సహాయంగా అందించబోతున్నామని ఆయన తెలిపారు.

'మగధీర' ప్రదర్శిస్తున్న థియేటర్లలో చిన్న టిక్కెట్ నుంచి పెద్ద టిక్కెట్ వరకూ కొని చూసే ప్రేక్షకులు కూడా ఈ ఛారిటీ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారనీ, ఆదివారం కూడా కావడంతో ఈ చిత్రాన్ని మరింత ఎక్కువ మంది చూసి వరద బాధితులకు తమ వంతు సహాయం అందించాలని ఆయన ప్రేక్షకాభిమానులను కోరారు. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు చిత్ర పరిశ్రమ ఇతోథికంగా ఆదుకుంటోందనీ, 'మగధీర' తరఫున తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చామనీ చెప్పారు. చిత్ర పరిశ్రమ నుంచి మొదటిగా 10 లక్షల సహాయాన్ని సిఎం రిలీఫ్ ఫండ్ కు అందించిన క్రెడిట్ కూడా ఈ చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ కు దక్కుతుంది.

No comments:

Post a Comment