చరణ్ కొత్త చిత్రం 21 నుంచి

'చిరుత', 'మగధీర' చిత్రాల తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త చిత్రం ఈనెల 21 నుంచి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. కె.వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ కె.నాగేంద్రబాబు నిర్మించనున్న ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా నటించనుంది. అంజనా ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ 7గా ఈ చిత్రం రూపొందనుంది.తొలిసారి చిత్ర విశేషాలను నాగేంద్రబాబు తెలియజేస్తూ, ఈనెల 21న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమవుతుందనీ, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ చెప్పారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రం కోసం కొంత పార్ట్ షూటింగ్ నవంబర్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాల్లో ప్లాన్ చేశామని చెప్పారు.'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి ట్రెమండస్ హిట్ చిత్రాల తర్వాత భాస్కర్ తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందనీ, 'మగధీర' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ తో చేస్తున్న ఈ సినిమా అందరి అంచనాలకు మించే విధంగా ఉంటుందనీ అన్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం భాస్కర్ అందిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, హారిస్ జైరాజ్ సంగీతం అందించనున్నారు.

No comments:

Post a Comment