'బంపర్ ఆఫర్' 16కు వాయిదా

సాయిరాం శంకర్ కథానాయకుడుగా వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న 'బంపర్ ఆఫర్' చిత్రం విడుదల వాయిదా పడింది. ఈనెల 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు పూరీ జగన్నాథ్ ఇటీవల ప్రకటించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీని మరో వారం రోజులు వాయిదా వేసినట్టు సమాచారం. ఆ ప్రకారం ఈనెల 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వరదలు కారణంగా పబ్లిక్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంటర్ టైన్ మెంట్ మూడ్ లో లేరనీ, ఈ తరుణంలో సినిమా విడుదల చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉండకపోవచ్చనీ ఈ చిత్ర దర్శకనిర్మాతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సాయిరాం శంకర్ సైతం హీరోగా సరైన బ్రేక్ కోసం కొద్దికాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ చిత్ర కథానాయిక బిందుమాధవికి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) కూడా కూడా ఒక సక్సెస్ అనివార్యం. ఈ చిత్రం ద్వారా జయరవీంద్ర తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతుండగా, గాయకుడు కుంచె రఘు సైతం ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. పూరీ జగన్నాథ్ సొంత అడియో సంస్థ పూరీ సంగీత్ ద్వారా ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇందులోని 'రావణమ్మ..' పాట ఇన్ స్టంట్ హిట్ గా డిక్లేర్ అయింది. సినిమా కూడా సక్సెస్ అవుతుందనే ధీమాతో ఉన్న పూరీ జగన్నాథ్ తాజా పరిణామాల దృష్ట్యా విడుదల తేదీని మరో వారం వాయిదా వేయక తప్పలేదు. అయితే శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం 'మహాత్మ' మాత్రం ముందుగా ప్రకటించినట్టు ఈనెల 9న విడుదలకు ముస్తాబవుతోంది.

No comments:

Post a Comment