బ్రహ్మానందం వితరణ

వరదబాధితులకు సాయం చేయటానికి మానవతా వాదులంతా ముందుకొస్తున్నారు. వారిలో సినీ నటులు రామ్ చరణ్ తేజ, జూనియర్ యన్.టి.ఆర్., రామోజీరావు ఇప్పటి వరకూ వరదబాధితులకు సాయం అందించగా,ఇప్పుడు ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం కూడా నేనూ నావంతు సాయం చేస్తానని ముందుకొచ్చారు.ఆయన వరదబాధితుల సహాయార్థం రెండు వ్యానుల నిత్యావసర వస్తువులు, రగ్గులు, బట్టలు పెబ్బేరుకు పంపించారు."ఇంతకాలం మిమ్మల్ని నవ్వించిన నేను ఇపుడు వరద వల్ల ఆపదలో ఉన్న మన అన్నదమ్ములకూ, అక్కచెల్లెళ్ళకూ నా వంతు సాయం నేను చేస్తున్నాను.దయచేసి మీరు కూడా మీకు తోచిన సాయం చెయ్యండి." అంటూ ఆయన ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment