నితిన్ హీరోగా వర్మ మరో చిత్రం

మన యువ హీరో నితిన్ హీరోగా, ప్రియాంక కొఠారి హీరోయిన్ గా, రామ్ గోపాల వర్మ ఇటీవల "అడవి" అనే చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది.ప్రస్తుతం నితిన్ హీరోగా, రామ్ గోపాల్‍ వర్మ మరో చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ చిత్రం "అడవి-2"కాదనీ, ఈ చిత్రం వర్మ గతంలో తీసిన సూపర్ హిట్‍ "రంగీలా"చిత్రంలా ఉంటుందని సమాచారం.ఒక విభిన్నమైన ప్రేమ కథా చిత్రంగా దీన్ని తయారుచేస్తున్నారని సమాచారం.ఇప్పుడు నితిన్ "సిద్ధూ ఫ్రం సీకాకుళం"చిత్రం ఫేం ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో,వెల్‍ ఫేర్ గ్రూప్ కంపెనీ వారు నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

No comments:

Post a Comment