నాలుగు భాషల్లో కృష్ణంరాజు

ఈ ఏడాది కొద్ది గ్యాప్ తో వచ్చిన 'అరుంధతి', 'మగధీర' వంటి పీరియాడిక్ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో పలువురు నిర్మాతలు ఇప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్న కథల అన్వేషణలో పడ్డారు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు సైతం కొద్దికాలంగా ఓ పీరియాడిక్ చిత్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. నాగార్జునతో 'శ్రీరామదాసు', బాలకృష్ణతో 'విజయేంద్ర వర్మ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను కొండా కృష్ణంరాజు నిర్మించారు. ఇప్పుడు ఏకకాలంలో నాలుగు భాషల్లో ఓ భారీ చిత్రాన్ని ఆయన నిర్మించబోతున్నారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. సుమారు 2 వేల ఏళ్ల క్రితం జరిగిన ఓ చారిత్రక సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది.

ఈ చిత్రం కోసం హాలీవుడ్ సినిమాల స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు పాటించనున్నాయి. విదేశీ టెక్నికల్ సిబ్బంది, ఫారెన్ లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. హిందీలో మంచి డిమాండ్ లో ఉన్న హీరో, హీరోయిన్ లో కోసం సంప్రదింపులు జరుగుతున్నాయనీ, 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి పలు భక్తిరస చిత్రాలకు కథా రచన చేసిన జె.కె.భారవికి ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ కూడా అప్పగించారనీ తెలుస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు శేఖర్ వి.జోసెఫ్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించబోతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన మేకప్ పర్సన్, కాస్టూమ్స్ డిజైనర్స్ పనిచేయబోతున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఎక్కువ భాగం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారనీ, డిసెంబర్ లో ఈ మెగా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందనీ తెలుస్తోంది. డేరింగ్ ప్రొడ్యూసర్ గా కొండా కృష్ణంరాజు ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టించనున్నారనేది ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

No comments:

Post a Comment