నితిన్ 'సీతారాముల కల్యాణం'

ఒక మంచి సక్సెస్ కోసం యువహీరో నితిన్ పడుతున్న కష్టం ఇంకా పూర్తిగా ఫలించలేదు. ఆయన నటించిన 'రెచ్చిపో' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూస కథ-కథనాలతో ఈ చిత్రం ఉందనే అభిప్రాయం వినిపిస్తున్నా మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలుగుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ తన తదుపరి చిత్రంపై ఇప్పుడు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నితిన్ కథానాయకుడుగా వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హైద్రాబాద్ లో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రానికి 'సీతారాముల కల్యాణం' అనే టైటిల్ అనుకుంటున్నారు. నితిన్ కు జోడిగా హన్సిక మోత్వాని నటిస్తోంది. హన్సికకు 'గోల్డెన్ గాళ్' గా పేరుంది. ఆమె నటించిన 'దేశముదురు', 'కంత్రి', 'మస్కా' చిత్రాలు కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు ఆమె గెస్ట్ గా నటించిన ప్రభాస్ 'బిల్లా' సైతం హిట్టయింది. ఈ నేపథ్యంలో హన్సిక నటిస్తున్న 'సీతారాముల కల్యాణం' తనకు మంచి సక్సెస్ ఇస్తుందనే ఆశాభావంతో నితిన్ ఉన్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment