యంగ్ హీరోలతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కు అయినా పరిశ్రమలో మంచి బ్రేక్ దొరికే అవకాశాలుంటాయి. 'చిరుత' చిత్రంతో నేహాశర్మ టాలీవుడ్ కు పరిచయమైతే, 'మగధీర' చిత్రంలోని రాణి మిత్రవింద పాత్ర కాజల్ కేరీర్ కు మంచి బ్రేక్ అయింది. ఈ రెండింట్లోనూ రామ్ చరణ్ కథానాయకుడు కాగా, ఇప్పుడు ఆయన తృతీయ చిత్రంలో ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జెనీలియా ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. ఆసక్తికరంగా ఈ చిత్రంలోని సెకెండ్ హీరోయిన్ పాత్రకు కృతి కర్బందా ఎంపికైనట్టు తెలిసింది. 'బోనీ' చిత్రం ద్వారా కృతి టాలీవుడ్ లో కి అడుగుపెట్టింది. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే కృతి ఫోటోజెనిక్ ఫేస్ పలువురు దర్శకనిర్మాతలను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూడటంతో కృతి మరో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఆ తరుణంలోనే బొమ్మరిల్లు భాస్కర్ నుంచి కృతికి ఆఫర్ వచ్చిందనీ, కృతి ఆ అవకాశం వెంటనే అందిపుచ్చుకుందనీ తెలుస్తోంది.రామ్ చరణ్ తృతీయ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు నిర్మించనున్నారు. మంచి కథ, కథనాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్ర తెరకెక్కనుంది. ఈనెల 21న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించి నవంబర్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాలలో రెగ్యులర్ షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతోంది. తొలి చిత్రం నిరాశపరచినా మలి చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని బ్యూటీ కర్బందా ఆశాభావంతో ఉంది.
No comments:
Post a Comment