నవంబర్ 19న జగద్గురు బాబా

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా భక్తులను అనుగ్రహిస్తున్న షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర విశేషాలతో రూపొందిన చిత్రం 'జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా'. నవంబర్ 19న ఈ చిత్రం విడుదలవుతుందని ప్రముఖ నటుడు ఎం.మోహన్ బాబు ప్రకటించారు. ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి టైటిల్ పాత్ర పోషించి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వివరాలను చిత్రయూనిట్ హైద్రాబాద్ లో గురువారంనాడు తెలియజేసింది. ముఖ్య అతిథిగా మోహన్ బాబు పాల్గొన్నారు.

బి.వి.రెడ్డి తనకు మంచి స్నేహితుడు మాత్రమే గాకుండా చక్కటి అభిరుచి ఉన్న నిర్మాత అనీ, ఈ సినిమాకు తనకు చూపించారనీ మోహన్ బాబు చెప్పారు. షిర్డీ సాయిబాబా పాత్రను బి.వి.రెడ్డి ఎంతో చక్కగా పోషించారని ప్రశంసించారు. ముఖ్యంగా సినిమా రెండో భాగంగా ఆయన నటన చూసినప్పడు ఎప్పుడో ఆయన నటుడిగా మారాల్సిందని తనకు అనిపించదని అన్నారు. ఇలాంటి భక్తిరస చిత్రాలకు ప్రేక్షకులు విజయం చేకూర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సాయిబాబా పాత్ర పోషించడానికి తనకు మోహన్ బాబే స్ఫూర్తి అని బి.వి.రెడ్డి పేర్కొన్నారు. సాయిబాబా దైవస్వరూపం మాత్రమే కాదనీ, సంఘ సంస్కర్త కూడాననీ అన్నారు. నాటి సమాజంలోని పరిస్థితులను చక్కబెట్టేందుకే ఆయన మానవుడిగా అవతరించారనీ, హిందూ-ముస్లింల సఖ్యతకు ఎంతో కృషి చేశారనీ అన్నారు. సాయిబాబా జీవితంలోని యదార్ధ సంఘటనలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని మలిచామని చెప్పారు. దర్శకుడు గూడ రామకృష్ణ మాట్లాడుతూ, తాము ఏదైతే చెప్పదలచుకున్నామో దానిని నటుడు, నిర్మాత బి.వి.రెడ్డి సహకారంతో నూటికి నూరు శాతం తెరపై ఆవిష్కరించామని చెప్పారు. సాయిబాబాగా ఆయన నటన మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. ఇందులో తాత్యా పాత్రను తాను పోషించినట్టు సత్యారెడ్డి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, నారాయణరావు, నాగబాబు, శివకృష్ణ, బ్రహ్మాజీ, రమాప్రభ, శివపార్వతి, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, గుండు హనుమంతరావు, జూనియర్ రేలంగి, చిట్టిబాబు తదితరులు నటించారు. కథ-స్క్రీన్ పై సైతం గూడ రామకృష్ణ అందించగా, కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, సుద్దాల అశోక్ తేజ-పరిమి రామనర్సింహం-తైదల బాపు పాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మేనఘు శ్రీను ఎడిటింగ్, లలిత్ సురేష్ సంగీతం అందించారు.

No comments:

Post a Comment