100 కోట్లతో పూరీ జగన్నాథ్ చిత్రం

"పోకిరి"చిత్రంతో తెలుగు చలన చిత్రపరిశ్రమలో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన పూరీ జగన్నాథ్ త్వరలో ఒక పెను సంచలన చిత్రంతో ప్రేక్షకులను ఆశ్చర్యంతో ముంచెత్తబోతున్నారు.100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీసేందుకు ఆయన ఒక అద్భుతమైన కథను తయారుచేశారు. అయితే ఈ కథ హాలీవుడ్ చిత్రం కోసం తయారుచేశారట.ఈ చిత్రం నిర్మించేందుకు తగిన నిర్మాత కోసం ప్రస్తుతం ఆయన ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న"ఏక్ నిరంజన్ "చిత్రానికి దర్శకత్వం చేస్తూ, తన తమ్ముడు సాయిరాం శంకర్‍ హీరోగా నటిస్తున్న "బంపర్‍ ఆఫర్‍" చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

No comments:

Post a Comment