'వరుడు' చిత్రం షూటింగ్ పై బుధవారం ఉదయం జరిగిన దాడి హేయమైనదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఖండించారు. అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని అనాజ్ పూర్ గ్రామంలో జరుగుతుండగా సుమారు 200 మంది తెలంగాణవాదులు, ఎబివిపి కార్యకర్తలు అడ్డుకుని యూనిట్ ను భయభ్రాంతులను చేసిన ఘటనపై అరవింద్ హైద్రాబాద్ లోని తన నివాసంలో స్పందించారు.మోహన్ బాబు కుమారుడు షూటింగ్ పై మంగళవారం నాడు దాడి జరిగినప్పుడే పరిశ్రమ స్పందించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిలించాంబర్ ఇప్పటికైనా స్పందించాలని సూచించారు. ఇది ఏదో రెండు సినిమాల షూటింగ్ లపై జరిగిన దాడిగా అనుకుంటే పొరపాటనీ, ఇది మిగతా వాటికి కూడా విస్తరించకుండా ఫిలించాంబర్ తగిన కార్యాచరణకు పూనుకోవాలని అన్నారు. అసలు షూటింగ్ స్పాట్ లో ఏమి జరిగిందో వివరించేందుకు అల్లు అర్జున్ ను, గుణశేఖర్ ను రమ్మనమని చెప్పాననీ, అయితే వారు హైద్రాబాద్ రావడానికి ఇంకా వ్యవధి పట్టే అవకాశం ఉండటంతో తాను మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఆందోళనకారులను కె.చంద్రశేఖర రావు కట్టడి చేయాలని సూచించారు
No comments:
Post a Comment