లక్ష్మీప్రసన్న గరం గరం!

లక్ష్మీప్రసన్న పూర్తి స్థాయి నిర్మాతగా మారి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తన సోదరుడు మంచు మనోజ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సందర్భంగా తెలంగాణ వాదుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అంత తేలిగ్గా మరిచిపోలేకున్నారు. మోహన్ బాబు తన కుమార్తె పేరుతో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై 50కి పైగా సినిమాలు నిర్మించారు. 51వ చిత్రాన్ని స్వయంగా లక్ష్మీప్రసన్న పర్యవేక్షిస్తూ నిర్మిస్తున్నారు. ఊహించని విధంగా మంగళవారంనాడు షూటింగ్ జరుగుతుండగా టిఆర్ఎస్ శ్రేణులు అక్కడ వీరంగం సృష్టించి యూనిట్ ను భయభ్రాంతులను చేయడాన్ని లక్ష్మీప్రసన్న సీరియస్ గానే తీసుకున్నారు. ఈ సందర్భంలోనే మనోజ్ ఒకరి కెమెరా లాక్కుని పగులగొట్టినట్టు అక్కడకు వచ్చిన మీడియా గుర్రుమంది. మీడియా వాళ్లెవరూ గోడ దూకి రారంటూ మీడియా ఆమెను నిలదిసినప్పుడు 'మీడియా వాళ్లు చెయ్యి కూడా పట్టుకోరు' అంటూ చురకంటించింది.ముగ్గురు పోలీసులు తన వద్దకు వచ్చి ఎ.సి.పి. బయట ఉన్నారనీ, రమ్మంటున్నారనీ తనతో ఉన్నప్పుడు బయటకు వస్తే గొడవలు కావచ్చనీ వారినే రమ్మనమనీ తాను కోరాననీ, దీంతో మహష్ గౌడ్ అనే వ్యక్తి 'నీ కోసం ఆయన రావాలా' అంటూ దురుసుగా మాట్లాడాడనీ, ఆయన పేరు చెప్పడానికి తనకు ఎలాంటి భయం లేదనీ లక్ష్మీప్రసన్న స్పష్టంచేశారు. నాన్నగారు (మోహన్ బాబు) తమను అలా పిరికిగా పెంచలేదని తెగేసి చెప్పారు. ఆరేళ్లుగా అమెరికాలో ఉన్న తనను ఎంతో గౌరవంగా చూశారనీ, సొంత తెలుగు వాళ్ల మధ్యకు వచ్చినప్పుడు ఇంత అమమానకరంగా ప్రవర్తించారనీ ఆమె గుర్రుమన్నారు. షూటింగ్ సామాగ్రిని పగులగొట్టడం వల్ల షూటింగ్ కు మళ్లీ కొంత టైమ్ పట్టినా అక్కడే షూటింగ్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అక్క లక్ష్మీప్రసన్న ఇంత గరం గరంగా ఉంటే...తమ్ముడు మనోజ్ మాత్రం 'నొప్పించక...తానొవ్వక' అనే రీతిలో ఒకవేళ తాను మీడియా పట్ల అనుచితంగా ప్రవర్తించానని అనుకుంటే అందుకు తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని చెప్పడం విశేషం

No comments:

Post a Comment