కొన్ని జంటలకు క్రేజీ కాంబినేషన్ గా పేరుంటుంది. రియల్ లైఫ్ లో కూడా ఆ జంట మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంటే ఇక స్క్రీన్ కెమిస్ట్రీకి తిరుగుండదు. జగపతిబాబు, ప్రియమణి జంట ఈ కోవలేనిదే. ఇప్పటికే 'పెళ్లైన కొత్తలో', 'ప్రవరాఖ్యుడు' చిత్రాలలో హిట్ పెయిర్ గా రొమాంటిక్ కెమెస్ట్రీని స్క్రీన్ పై వీరు పండించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ రొమాంటిక్ జంట 'సాధ్యం' చిత్రంలో నటిస్తోంది. కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందేననీ, ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతవరకూ వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. జగపతిబాబు కెరీర్ లో ఇదో వైవిధ్యమైన పాత్ర అనీ, ప్రియమణి అభియనానికి ఆస్కారమున్న పాత్రను పోషిస్తోందనీ, ముఖ్యంగా ఈ ఇద్దరి పాత్రల తీరు తెన్నులు ఆసక్తికరంగా ఉంటాయనీ చెప్పారు. జగపతిబాబు ఇంతవరకూ నటించిన చిత్రాల కంటే భారీ వ్యయంతో ఈచిత్రం రూపొందుతోందని దర్శకుడు గోపాలకృష్ణ తెలిపారు. ఈ నెలాఖరు వరకూ జరిగే షెడ్యూల్ తో టాకీ, జనవరిలో పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, యు.పి.రాజు, ప్రగతి, మధుమణి, మున్నా వేణు, సత్తెన్న, గుండు సుదర్శన్, భార్గవి నటిస్తున్నారు. శ్యామ్-మడూరి మధు మాటలు, మారో పళని సినిమాటోగ్రఫీ, చిన్నిచరణ్ సంగీతం అందిస్తున్నారు
No comments:
Post a Comment