'కందిరీగ' భామలు

ఎక్కువగా సింగిల్ హీరోయిన్లతో సరిపుచ్చుకుంటున్న రవితేజ ఇప్పుడు జోడు హీరోయిన్లతో గ్లామర్ తళుకులీనబోతున్నారు. 'సింధూరం', 'ఖడ్గం' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడుగా నటించనున్న 'కందిరీగ' చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. ఒకహీరోయిన్ గా సమీరారెడ్డి, మరో హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ ఎంపికైనట్టు సినీ వర్గాల భోగట్టా. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.బాలీవుడ్ నుంచి వచ్చిన సమీరా రెడ్డి తెలుగులో ఎన్టీఆర్ తో 'అశోక్', చిరంజీవితో 'జై చిరంజీవ' చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ బాలీవుడ్ వెళ్లిపోయింది. ఈమధ్యనే 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' అనే అనువాద చిత్రంలో ఆమె నటించింది. బాలీవుడ్ నుంచే వచ్చిన స్నేహ ఉల్లాల్ సైతం కొద్దికాలంగా తెలుగులో తన కెరీర్ ను కొనసాగిస్తోంది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'నేను మీకు తెలుసా', 'కరెంట్' చిత్రాలలో నటించిన స్నేహ ప్రస్తుతం బాలకృష్ణకు జోడిగా 'సింహా'లో నటిస్తోంది. తాజాగా రవితేజ 'కందిరీగ' సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతో యువహీరోయిన్ల రేసులో తాను కూడా ఉన్నానని చాటుకుంటోంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు ముని మనువడుగా విలక్షణ పాత్రను రవితేజ పోషించనున్నారు. జనవరి 9న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది

No comments:

Post a Comment