'వందేమాతర' గీతాన్ని తనదైన శైలిలో కంపోజ్ చేసి దేశప్రజలను ఉర్రూతలూగించిన రెహ్మాన్ 'జైహో' గీతంతో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొన్నారు. 'స్లమ్ డాగ్ మిలయనీర్' ద్వారా ఆస్కార్ ల పంట పడించారు. ఇప్పుడు మరో అరుదైన అవకాశాన్ని కూడా ఆయన అందిపుచ్చుకోబోతున్నారు. పదకవితా మహుడు తాళ్లపాక అన్నమయ్య గీతాలకు సాంప్రదాయ పద్ధతిలో కొత్త కోణంలో ఆవిష్కరించే బాణీలు సమకూర్చాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు రెహ్మాన్ ను కోరనున్నారు.పద్నాల్గవ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య స్వయంగా ఏడుకొండలవాడైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ ఆలపించిన కీర్తనలు నేటికీ ఎంతో ప్రచారంలో ఉన్నాయి. గోవిందుని కీర్తనలను తనదైన బాణీలో భక్తులకు అందించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను కోరనుంది. టి.టి.డి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ డి.కె.ఎ.నాయుడు ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపినట్టు సమాచారం. అన్నమయ్య కీర్తనలను సరికొత్త బాణీలో కంపోజ్ చేయాల్సిందిగా రెహ్మాన్ ను కోరాలని తాము చర్చించిన మాట నిజమేననీ, రెహ్మాన్ తో సంప్రదించాలనే నిర్ణయాన్ని త్వరలోనే తీసుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు తెలిపారు. 'రెహ్మాన్ తన సేవలను అందించేందుకు ఆసక్తి చూపుతారనే నమ్మకం ఉంది' అని టిడిపి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు
No comments:
Post a Comment