'అనుకోకుండా ఒకరోజు' తర్వాత ఛార్మి కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం 'మంత్ర'. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఇదొక సంచలనం. అగ్రహీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రానికి భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఆ చిత్రం లైన్స్ లోనే 'అనసూయ', 'అరుంధతి' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించాయి. 'మంత్ర' చిత్రాన్ని తొలి ప్రయత్నంగా నిర్మించి సక్సెస్ సాధించిన తులసీరామ్ ఇప్పుడు మరోసారి ఛార్మినే కథానాయికగా ఎంపిక చేసి ఓ సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి 'మంగళ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.'మంత్ర' విజయపరంపర కొనసాగేందుకు 'మ' అక్షరం కలిసొచ్చేలా ఈ టైటిల్ ను ఆయన ఎంచుకున్నట్టు అనుకోవచ్చు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభించేందుకు తులసీరామ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఛార్మి నటించిన 'మాయగాడు', 'సయ్యాట' చిత్రాలు, కన్నడ అనువాద చిత్రం 'జాదూగాళ్లు' విడుదలకు సిద్ధమవుతుండగా, 'అగాథన్' అనే మలళాయ చిత్రం ప్రోగ్రస్ లో ఉంది.
No comments:
Post a Comment