ఐదుగురు హీరోలతో బెల్లంకొండ

ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు తెలంగాణ, సమైక్య ఆంధ్ర ఆందోళనలతో చిత్ర పరిశ్రమ అతలాకుతలవుతున్న తరుణంలో బెల్లంకొండ సురేష్ అరడజను ప్రాజెక్ట్ లతో డేర్ ప్రొడ్యూసర్ గా తన సత్తా చాటుకుంటూ ఆందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందులో రెండు చిత్రాలకు రవితేజ హీరో కాగా, గోపీచంద్, బాలకృష్ణ, నారా రోహిత్ తలో చిత్రంలో నటించబోతున్నారు. వీటికితోడు బెల్లంకొండ సురేష్ తన కుమారుడు సాయిని హీరోగా పరిచయం చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.రవితేజ కథానాయకుడుగా సముద్రఖని దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. రవితేజతోనే కృష్ణవంశీ దర్శకత్వంలో 'కందిరీగ' అనే మరో చిత్రాన్ని కూడా ఆయన నిర్మిస్తున్నారు. జనవరి 9 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. వీటికి తోడు బాలకృష్ణ కథానాయకుడుగా బెల్లంకొండ నిర్మించ తలపెట్టిన చిత్రానికి స్క్రిప్టు సిద్ధమైంది. బాలకృష్ణ 'సింహా' చిత్రం పూర్తయిన వెంటనే ఈ కొత్త చిత్రం ప్రోగ్రస్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. గోపీచంద్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందున్న 'గోలీమార్' చిత్రానికి కూడా బెల్లంకొండ నిర్మాత. అలాగే 'బాణం'తో పరిశ్రమకు పరిచయమైన నారా రోహిత్ సైతం బెల్లంకొండ చిత్రానికి సైన్ చేశారు. ఈ చిత్రానికి ఒక అగ్ర దర్శకుడు పనిచేయబోతున్నారు. వీటికితోడు బెల్లంకొండ సురేష్ తన కుమారుడు సాయిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను టాప్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కు అప్పగించారు. 2011లో ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది. ఈ వరుస ప్రాజెక్ట్ లతో 2010 చివరి వరకూ బెల్లంకొండ డైరీ నిండిపోయింది.

No comments:

Post a Comment