డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రం 'యంగ్ ఇండియా'. దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 22న రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముహూర్తంతో ప్రారంభమైన ఈ చిత్రం ఈనెల 1వ తేదీతో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.'యంగ్ ఇండియా' ప్రోగ్రస్ పై దాసరి మాట్లాడుతూ, ముందుగానే ఊహించి కొత్తవారికి 2 నెలల పాటు ఇచ్చిన ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడిందనీ, 10 రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన మొదటి షెడ్యూల్ లో కొత్త నటీనటులతా సంతృప్తి కరమైన నటన ప్రదర్శించారని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ముగ్గురు సపోర్టింగ్ ఆర్టిస్టులు, ఒక కమెడియన్ ను కూడా పరిచయం చేస్తున్నామనీ, వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రెండో షెడ్యూల్ ఈనెల 6 నుంచి 21వరకూ తిరిగి రామోజీ ఫిలిం సిటీలోనే చేస్తున్నట్టు చెప్పారు.నిర్మాత రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, 81 మంది కొత్త నటీనటులకు రెండు నెలల పాటు ఇచ్చిన శిక్షణ షూటింగ్ లో ఎంతో ఉపయోగపడిందనీ, రెండో షెడ్యూల్ తర్వాత విశాఖ పట్నం, ముంబైలలో జరిపే చివరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. సంచలన కథతో దాసరిగారు తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందన్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం దాసరి అందిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్.రమణరాజు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, రాఖీ రాజేష్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment