'రమ్మీ'కి 13 లక్షలు!

సాంకేతిక విప్లవం కారణంగా వాణిజ్యపరంగా కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటున్నాయి. ఇదే సమయంలో 'బ్లాక్ మెయిలింగ్' బిజినెస్ కూడా ఎక్కువవుతోంది. యువసామ్రాట్ నాగార్జున తన కొత్త చిత్రం టైటిల్ ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. నాగార్జున కథానాయకుడుగా కామాక్షి కళామూవీస్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రానికి 'కేడీ' అనే టైటిల్ నిశ్చయించారు. నిజానికి ఈ టైటిల్ కు ముందే 'రమ్మీ' అనే టైటిల్ నిశ్చయించారంటూ బలమైన ప్రచారం జరిగింది. ఓ వారం రోజుల క్రితం ఆ టైటిల్ కు బదులు 'మోసగాడు', 'మాయగాడు' వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా 'రమ్మీ' అనే టైటిల్ నే అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే 'రమ్మీ'ని పక్కనపెట్టి ఇప్పుడు 'కేడీ' టైటిల్ ను ఖరారు చేయడం వెనుక ఓ కథే ఉందని నాగ్ చెప్పుకొచ్చారు.'రమ్మీ' అనే టైటిల్ ను వేరెవరో రిజిస్టర్ చేశారనీ, దీంతో సినిమా టైటిల్ ఇదేనంటూ మీడియా ప్రచారం చేస్తూ వచ్చిందనీ ఆయన తెలిపారు. ఆ టైటిల్ కోసం సంప్రదించినప్పుడు 13 లక్షలు అడిగారనీ, ఇటీవల కాలంలో సినిమాల టైటిల్స్ ను ముందుగానే ఊహించి కొందరు వాటిని రిజిస్టర్ చేయించి ఆ టైటిల్ కు బాగా ప్రచారం వచ్చిన తర్వాత పెద్ద నిర్మాతలతో బేరసారాలకు దిగుతున్నారని అన్నారు. ఈ మధ్యనే ఓ నిర్మాత 'ఖిలాడీ' అనే టైటిల్ కు 4 లక్షలు చెల్లించి తీసుకున్నట్టు తన దృష్టి కి వచ్చిందన్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ వేళ్లూనుకుంటోందన్నారు. నాగార్జున ఆవేదనను తప్పుపట్టలేనప్పటికీ.... సినిమా ప్రారంభం రోజునే టైటిల్ అనౌన్స్ చేయకుండా చివరివరకూ సస్పెన్స్ మెయింటన్ చేయడం ద్వారా జనం ప్రచారం చేసిన టైటిల్ నే (ఫ్రీ పబ్లిసిటీ వచ్చిన తర్వాత) ఖరారు చేయాలనుకునే నిర్మాతలకు అడపాదడపా ఇలాంటి సమస్యలు తప్పకపోవచ్చు



No comments:

Post a Comment