'కిల్లర్'గా గద్దె సింధూర

గద్దె సింధూర ప్రధాన పాత్రలో శ్రీ శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత కిరణ్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి 'కిల్లర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నగేష్ నారదాసి దర్శకుడు. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందిఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నగేష్ నారదాసి తెలిపారు. ఇందులో గద్దె సింధూర ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారనీ, ఆమె మాత్రమే చేయదగిన పాత్ర ఇదనీ చెప్పారు. గద్దె సింధూర, తనికెళ్ల భరణి, షఫి, పృధ్వి తదితరులపై కొన్ని కీలస సన్నివేశాలను హైద్రాబాద్ లో షూట్ చేయడంతో టాకీ పార్ట్ పూర్తయిందని తెలిపారు. జనవరి నుంచి బాంబే, చెన్నై పరిసర ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుపుతామనీ, ఈ నెలాఖరులో ఆడియో, జనవరి చివర్లో సినిమా రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నిళల్ గళ్ రవి, అనిల్, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. మధు ఎ నాయుడు సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఆంటోని కొరియోగ్రఫీ, జె.పి. కళాదర్శకత్వం, నందమూరి హరి ఎడిటింగ్, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment