రవితేజ 'కందిరీగ' జనవరిలో

ఇవాల్టి బిజీ హీరోల్లో ఒకరైన రవితేజ తన సినీ గురువు కృష్ణవంశీ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు. 'సింధూరం' చిత్రంతో రవితేజకు సరైన బ్రేక్ ఇచ్చిన కృష్ణవంశీ ఆ తర్వాత 'ఖడ్గం' చిత్రంతో మరో మంచి సక్సెస్ ను ఆయనకు ఇచ్చారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి 'కందిరీగ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నాలుగైదు నెలల క్రితమే జరిగినప్పటికీ రవితేజ బిజీ షెడ్యూల్స్ కారణంగా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవుతుంది.

రవితేజ ప్రస్తుతం సుముద్రఖని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న సినిమాకి కూడా రవితేజ కమిట్ అయ్యారు. ఫ్రిబవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతోంది. కాగా, కృష్ణవంశీ-రవితేజ 'కందిరీగ' చిత్రాన్ని జనవరిలో సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చారిత్రక నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ చిత్రంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిక శ్రీకృష్ణదేవరాయలు ముని మనువడుగా రవితేజ నటించనున్నారు. ఈ చిత్రానికి స్క్రిప్టు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.


No comments:

Post a Comment