ఐటెం గాళ్ గా నయనతార

హీరోయిన్లకు స్టార్ డమ్ అనేది ఎంతకాలం ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. అయితే ఇవాల్టి హీరోయిన్లు కొంత గడుసరితనం, మరికొంత లౌక్యంతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఒక భాషలో కాకపోతే మరో భాషలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. నయనతారను ఈ కోవలోనే చెప్పుకోవచ్చు. తెలుగులో ఇవాల్టి అగ్రహీరోలందరితోనూ నటిస్తున్న ఆమె తమిళంలోనూ తన క్రేజ్ ను తగ్గకుండా చూసుకుంటోంది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్ లకు కూడా ఓకే చెబుతోంది. ఈ మధ్యనే రజనీకాంత్ 'శివాజీ' చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన నయనతార ఆ తర్వాత 'కుచేలన్'లోనూ నటించింది. తాజాగా రజనీకాంత్ అల్లుడు ధనుష్ కథానాయకుడుగా నటిస్తున్న 'మాపిళ్లై' చిత్రంలో ఓ స్పైసీ ఐటెం సాంగ్ లో నటించేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకప్పుడు రజనీకాంత్ నటించగా విజయవంతమైన 'మాపిళ్లై' చిత్రానికి ఇది రీమేక్ కావడం ఓ విశేషం కాగా, తెలుగులో హీరోయిన్ గా పలు అవకాశాలతో బిజీగా ఉన్న హన్సిక మోత్వాని ఈ చిత్రంలో కథానాయిక కావడం మరో విశేషం. నయతార ఇటీవలే తమిళ 'బిల్లా' చిత్రంతో ప్రేక్షకులను ఆక్టటుకుని సూర్య 'ఆదవన్' చిత్రంతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆర్య కథానాయకుడుగా రూపొందుతున్న 'బాస్ ఎంగిర భాస్కరన్' చిత్రంలోనూ, మలయాళంలో దిలీప్ సరసన 'బాడీ గార్డ్' చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన మెయిన్ హీరోయన్ గా నటిస్తున్న 'అదుర్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. నందమూరి బాలకృష్ణ 'సింహా'లో మరో ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటిస్తోంది. వీటికి తోడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'గోవా'లో నయనతార ఓ ఐటెం సాంగ్ లో నర్తిస్తోంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తున్నారు. మొత్తానికి హీరోయిన్ అవకాశాలే కావాలని పట్టుబట్టకుండా తన మిత్రులు, సన్నిహితుల కోసం అడదపాదడపా తన రూల్స్ కూడా మార్చుకుంటున్న నయనతార లౌక్యం మెచ్చుకోదగినదే.

No comments:

Post a Comment