తెలంగాణాలోని ప్రస్తుత పరిస్థితుల ప్రభావం సినీ పరిశ్రమకు సైతం సోకుతోంది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం తీసుకోకుండా ఆంధ్ర ఫిల్మ్ మేకర్స్ తీసే సినిమాలు తెలంగాణలో రిలీజ్ కానీయబోమంటూ తెలంగాణా విద్యార్థుల సంయుక్త కార్యాచరణ సమితి హెచ్చరికలు ఒకవైపు, రెండు రోజుల బంద్ మరోవైపు కొత్త రిలీజ్ లపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 500కు పైగా థియేటర్లు ఉండగా, వీటిలో పలు థియేటర్లు జనం లేక మూతబడే ప్రమాదం ఉందనీ, రెండ్రోజుల బంద్ కారణంగా తెలంగాణ రిజీయిన్ లోని ఎగ్జిబిటర్లు (థియేటర్ల యాజమాన్యాలు) 3 కోట్ల రూపాయల వరకూ నష్టపోవాల్సి వచ్చిందనీ హైద్రాబాద్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో గత వారం విడుదలైన చిత్రాలు నైజాం ఏరియాల్లో ఘోరంగా చతికిలపడుతున్నాయి. అయితే ముందుగానే అనౌన్స్ చేసిన చిత్రాలు మాత్రం ఈ శుక్రవారం యథావిథిగా విడుదలవుతున్నాయి. ఒకసారి రిలీజ్ తేదీ ప్రకటించి విడుదలలో జాప్యం జరిగితే నిర్మాతలు వడ్డీల రూపంలో కోట్లాది రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మంచు విష్ణు కథానాయకుడుగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మించిన 'సలీమ్', సాయిరాం శంకర్ కథానాయకుడుగా రాజేంద్ర దర్శన్ దర్శకత్వంలో వీరేష్ కాసాని, రఘునాధ్ సోగి సంయుక్తంగా నిర్మించిన 'వీడే కావాలి' చిత్రాలు ఈ శుక్రవారం (11న) విడుదలవుతున్నారు. వీటికితోడు హాలీవుడ్ 'ది ట్విటైల్ సాగా-న్యూ మూన్' చిత్రం 'అమావాస్య' పేరుతో తెలుగు, ఇంగ్లీషు, హిందీ వెర్షన్ లలో ఇదే రోజు విడుదలవుతోంది. జెనీలియా కథానాయికగా జస్ట్ ఎల్లో పతాకంపై రూపొందిన 'కథ' చిత్రం 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీటిల్లో 'సలీమ్' చిత్రం భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పాటు 295 ప్రింట్లతో విడుదలవుతూ, గురువారంనాడు హైద్రాబాద్ లో ఛారిటీ షో ద్వారా వచ్చే మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం అందించబోతున్నారు. ఈ చిత్రాలు విడుదలకు మరో రెండ్రోజులు ఉండటంతో అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతాయనీ, థియేటర్లు మళ్లీ కళకళలాడతాయనీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

No comments:
Post a Comment