శశాంక్, బియాంక (తొలి పరిచయం) జంటగా బ్లూ ఫాక్స్ సినిమా పతాకంపై గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'కాఫీబార్'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో సోమవారం సాయంత్రం జరిగింది. ముఖ్యమంత్రి కె.రోశయ్య తొలి ఆడియో సీడీని ఆవిష్కరించి సీనియర్ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడుకు అందజేశారు. జె.సి.దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, తులసీ రెడ్డి, బసిరెడ్డి, సీనియర్ నిర్మాత చదలవాడ తిరుపతిరావు, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, శశాంక్, గీతాకృష్ణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. గీతాకృష్ణ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.రోశయ్య మాట్లాడుతూ, ఇవాల్టి సినిమాల ట్రెండ్ గురించి తనకు అంతగా తెలియదని, ఎన్టీఆర్ నుంచి శోభన్ బాబు, కృష్ణ వరకూ తనకు తెలుసుననీ అన్నారు. తాను సినిమాలు చూడటం కూడా చాలా తక్కువేనననీ, ప్రస్తుతం తెలుగు సినిమాల హీరోలు, వారి స్టాటస్ కూడా పెద్దగా తెలియదనీ అన్నారు. సరికొత్త పంథాలో సినిమాలు తీసే దర్శకుడు గీతాకృష్ణ అనీ, ఈ చిత్రం కూడా బాగా తీసి ఉంటారని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా వైవిధ్య భరితంగా తీర్చిదిద్దాదననీ, ఇందుకు సహకరించిన యూనిట్ అందరికీ తన కృతజ్ఞతలనీ గీతాకృష్ణ అన్నారు.
No comments:
Post a Comment