టైటిల్ లో సింహం పేరు చోటుచేసుకోవడం నందమూరి హీరోల ట్రేడ్ మార్క్ కావచ్చు. పెద్దాయన ఎన్టీఆర్ 'సింహబలుడు' అయితే, ఆయన తనయుడు బాలకృష్ణ 'సింహా'గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందమూరి ఫ్యామిలీ మూడోతరం వారసుడుడైన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా 'సింహ ధ్వని' చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఎన్టీఆర్ కథానాయకుడుగా వెల్ ఫేర్ క్రియేషన్స్ సంస్థ నిర్మించ తలబెట్టిన ఓ భారీ చిత్రానికి 'సింహధ్వని' అనే టైటిల్ అనుకుంటున్నారు. గతంలో బాలకృష్ణ 'సమరసింహారెడ్డి' చిత్రానికి 'సింహధ్వని' టైటిల్ అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆ టైటిల్ డ్రాప్ అయింది. బాబాయ్ మిస్సయిన టైటిల్ ను ఇప్పుడు అబ్బాయ్ సినిమాకి పెట్టాలని వెల్ ఫేర్ అధినేతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా హన్సిక ను ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏటా రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'అదుర్స్' చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ డిసెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత దిల్ రాజు నిర్మించనున్న 'బృందావనం', అశ్వనీదత్ నిర్మాతగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న 'శక్తి' చిత్రాలకు ఎన్టీఆర్ కమిట్ అయ్యారు. వీటి తర్వాత వెల్ ఫేర్ క్రియేషన్స్ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశా
No comments:
Post a Comment