నిఖిల్, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా రూerపొందుతున్న చిత్రం 'కళవర్ కింగ్'. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పణలో సాయికృష్ణా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎల్.సురేష్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత పోకూరి బాబూరావు ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అందజదేశారు. ఆడియో సీడీని హీరో నితిన్ ఆవిష్కరించి దిల్ రాజుకు అందించారు.ఈ చిత్రానికి యూత్ టీమ్ పనిచేసినట్టు కనిపిస్తోందనీ, తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాననీ ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇందులో పాటలు చాలా హుషారుగా ఉన్నాయని పోకూరి బాబూరావు తెలిపారు. హీరో నిఖిల్ లో మంచి ప్రతిభాపాటవాలు ఉన్నాయని నితిన్ పేర్కొన్నారు. నిఖిల్ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ తనను ఎంతో ఆకట్టుకుందనీ, దర్శకుడు సురేష్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ అన్నారు. ఇందులో విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను పోషించినట్టు శ్వేతబసుప్రసాద్ తెలిపింది. సంగీత దర్శకుడుగా ఇది తన మూడో చిత్రమనీ, మంచి మాస్ పాటలు కూడా చేశాననీ అనిల్ పేర్కొన్నారు. కోడిరామకృష్ణ, రవికుమార్ చౌదరి, బివిఎస్ఎన్ ప్రసాద్, శైలేంద్రబాబు, చిత్ర నిర్మాతలు దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎ.చంద్రశేఖర్, సహనిర్మాతలు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment