పెళ్లి ఇప్పుడే కాదు: రంభ

దక్షిణాదిన తన అందచందాలతో ఉర్రూతలూగించిన రంభ ఈ డిసెంబర్ లోనే కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ ను వివాహమాడనుందంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై రంభ తొలిసారిగా పెదవి విప్పింది. ఇంద్రన్ పద్మనాధన్ (రంభను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్న కెనడా కంపెనీ యజమాని) పెళ్లి ప్రపోజల్ చేసిన మాట నిజమేననీ, అయితే ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదనీ ఆమె వెల్లడించింది.'వివాహానికి సంబంధించిన అంశం ఇంకా డిస్కసింగ్ స్టేజ్ లోనే ఉంది. వివాహ ప్రస్తావన ఇంద్రన్ నుంచే వచ్చింది. అయితే ఇంకా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పింది రంభ. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు త్వరలోనే సమావేశమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ, డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటాననే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. తన కజిన్స్ లో ఒకరి వివాహం కుదరడంతో తన పేరిట మ్యారేజ్ హాలు బుక్ చేయడం జరిగిందనీ, దీంతో రంభ పెళ్లయిపోతోందంటూ వదంతులు మొదలయ్యాయనీ ఆమె నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం రంభ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న'ప్రతిక్షణం' చిత్రంలో నటిస్తోంది. రంభ సోదరుడు నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోది. అలాగే హాలీవుడ్ 'క్విక్ గన్ మురుగన్' సీక్వెల్ కు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీక్వెల్ ఎప్పుడు మొదలైనా అందులో తాను ఉంటానని రంభ చెప్పుకొచ్చింది

No comments:

Post a Comment