గోపీచంద్ 'గోలీమార్' మొదలు

గోపీచంద్ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'గోలీమార్' చిత్రం షూటింగ్ సోమవారం ఉదయం జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రైవేటు భవంతిలో ప్రారంభమైంది. గోపీచంద్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి క్లాప్ ఇవ్వగా, పూరీ జగన్నాథ్ భార్య లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు.పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైందనీ, 2010 మార్చి నాటికి పూర్తవుతుందనీ చెప్పారు. ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్ గా సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కథ ఇదనీ, చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనీ చెప్పారు. గోపీచంద్ ను కొత్త కోణంగా ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. గోపీచంద్-జగన్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటడం సంతోషంగా ఉందని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. జగన్ సినిమా ప్రారంభానికి ముందే రిలీజ్ డైట్ అనౌన్స్ చేస్తుంటారని అన్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లోకల్ ఇన్సిడెంట్స్ ను జతచేసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందని అన్నారు. పూరీ జగన్ వంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందనీ, ఆయన చెప్పిన కథ చాలా ఎక్స్ టార్డినరీగా ఉందనీ గోపీచంద్ అన్నారు. హీరోగా తన రేంజ్ ను పెంచ్ పవర్ ఫుల్ ఫిల్మ్ ఇదని అన్నారు. ఈ చిత్రంలో నటి ప్రియమణి తొలిసారిగా గోపీచంద్ సరసన నటిస్తోంది. నాజర్, రోజా, షావర్ అలీ, పశుపతి, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, జీవా, ఆర్యమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం పూరీ జగన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, విజయ్ యాక్షన్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment