వెండితెర హీరోలు షూటింగ్ సమయాల్లో ఎంత ముందు జాగ్రత్త తీసుకున్నప్పటికీ అడపాదడపా చిక్కుల్లో పడుతుంటారు. హీరో రామ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని తృటిలో తప్పించుకున్నారు. రామ్ ను పోలీసులు టార్గెట్ చేసి రైఫిల్స్ ఎక్కుపెట్టిన సంఘటన ఇటీవల ముంబైలో జరిగింది.
రామ్ కథానాయకుడుగా నటిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' షూటింగ్ ఇటీవల ముంబైలోని హోటల్ ట్రిడెంట్ సమీపంలో జరిగింది. గత ఏడాది నవంబర్ 26న ముంబై వాసులను తీవ్రవాదులు భ్రయభ్రాంతులను చేసిన సంఘటన ఇక్కడే జరిగింది. ఈ ప్రాంతంలోనే రామ్ పై ఓ ఛేజ్ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. బుల్లెట్ల తూట్లు పడిన స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ను రామ్ వేగంగా నడుపుతుండగా, ఓపెన్ టాప్ వాహనాల్లో గూండాలు తరుముతూ ఆయన వాహనంపై కాల్పులు జరిపే సంఘటనను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కు ముందుగా పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే ఊహించని విధంగా అక్కడకు చేరుకున్న కొందరు సాయిధ పోలీసులు నిజంగానే అక్కడ ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతోందని భావించి రామ్ నూ, ఇతర వాహనాలపై ఉన్న వారిని రౌండప్ చేసి తుపాకులు ఎక్కుపెట్టారు. లక్కీగా ఆ పరిసరాల్లోనే ఉన్న పోలీసులు పరుగు పరుగున వచ్చి తమ సహచర పోలీసులను నిలువరించారు. అసలు విషయం తెలిసి వారు తుపాకులు దించడంతో రామ్ అండ్ కో తేల్లిగా ఊపిరి పీల్చుకున్నారు. 'పోలీసులు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే...నా బ్లాగింగ్ డేస్ ముగిసిపోయోవేమో?' అంటూ రామ్ తన సొంత బ్లాగ్ (హీరో రామ్ డాట్ కామ్)లో ఈ ముచ్చట చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment