యువ హీరోల్లో ఎన్టీఆర్ ఓ చిచ్చరపిడుగు. ఇవాల్టి సంచలన దర్శకులుగా పేరున్న రాజమౌళి 'సింహాద్రి' తోనూ, వినాయక్ 'ఆది' తోనూ మంచి కమర్షియల్ డైరెక్టర్లుగా స్థిరపడ్డారు. వినాయక్ ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ కాంబినేషన్ లో 'అదుర్స్' చిత్రాన్ని ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రాజమౌళి ఈమధ్యనే 'మగధీర' చిత్రంతో తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ రికార్డును 'అదుర్స్' చిత్రం అధిగమించే అవకాశాలపై కూడా కొద్దిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. దీనికి రాజమౌళి కూడా ఈమధ్యన జరిగిన 'అదుర్స్' చిత్రం ఆడియో వేడుకలో వంత పాడారు. 'మగధీర రికార్డులను అదుర్స్ కొట్టేస్తుంది' అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. రాజమౌళి స్టేట్ మెంట్ వెనుక ఆయన ఆలోచన ఏమై ఉండొచ్చనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది.
రాజమౌళి చెప్పినట్టే 'మగధీర'ను 'అదుర్స్' తోసిరాజంటే ఆయన జోస్యం ఫలించినట్టవుతుంది. ఇది ఆయనను ఎన్టీఆర్ కు మరింత చేరువ చేస్తుంది. అలా కాకుండా 'అదుర్స్' బాక్సాఫీస్ ను ఆకట్టుకోని పక్షంలో 'మగధీర' రికార్డును అధిగమించేలా ఓ సినిమా చేసిపెట్టమని రాజమౌళిని ఎన్టీఆర్ అడవచ్చు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రాజమౌళి తన స్టేట్ మెంట్ ద్వారా 'అదుర్స్' చిత్రంపై భారీ హైప్ పెంచారనీ, అందుకు తగ్గట్టుగా ఆ చిత్రం లేకపోతే ఫ్లాప్ అవుతుందనీ, దీంతో రాజమౌళి 'మగధీర' రికార్డు యథాతథంగా ఉండిపోతుందనేది ఆయన ఆలోచన కావచ్చనీ ఈ వాదన సారాంశం. బహుశా...దీనిని గమనించే ఎన్టీఆర్ సైతం రాజమౌళి స్టేట్ మెంట్ ను డైల్యూట్ చేస్తూ 'నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించ లేదు' అంటూ ఆడియో వేదిక నుంచే చెప్పుకొచ్చారు. రాజమౌళి జోస్యం ఫలిస్తుందా? లేకుంటే ఆయనతోనే ఎన్టీఆర్ మరో ప్రయత్నం చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

No comments:
Post a Comment