యాడ్ ల్యాబ్స్ కు 'సలీమ్'

మంచు విష్ణువర్దన్ బాబు, ఇలియానా జంటగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రిలయెన్స్ బిగ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన 'సలీమ్' చిత్రాన్ని యు.ఎస్.ఎ. ఇన్ కార్పేరేషన్ సంస్థ (రిలయెన్స్ అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్) గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ తో కలిసి ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.

వై.వి.ఎస్.చౌదరి కొద్ది గ్యాప్ తర్వాత 'సలీమ్' (దుమ్ము రేపుతాడు) చిత్రం ద్వారా మరోసారి సంచనలనం సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో సలీమ్ గా టైటిల్ పాత్రను విష్ణు పోషించగా, 'సత్య' అనే యంగ్ గాళ్ గా ఇలియానా, వినోదంతో కూడిన పవర్ ఫుల్ పాత్రలో డాక్టర్ ఎం.మోహన్ బాబు, 'చిట్టి'గా మరో పాత్రలో కావేరీ ఝా నటించారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అమెరికాలో తొలివారం ప్రదర్శితమవుతున్న సెంటర్లలో న్యూజెర్సీ, వర్జీనియా, అట్లాంటా, డెట్రాయిట్, లాస్ ఏంజెల్స్, సాన్ హోసె, హూస్టన్ ఉన్నారు. మిగిలిన సిటీ/కంట్రీలలో ప్రదర్శన కోసం...

No comments:

Post a Comment