'తెలియదు' ఆడియో

నేటి యువతీ యువకుల మనోభావాలను అద్దంపట్టే వినూత ప్రేమకథా చిత్రం 'తెలియదు'. కేమ్ ఫ్రెండ్స్ అకాడమీ పతాకంపై హండ్రెడ్, శరత్, నాగరాజు, సంతోష్ పార్లవార్, అలేఖ్య హీరోహీరోయిన్లుగా డాక్టర్ రాజిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని గోటేటి కల్యాణ వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తొలి సీడీని ఆవిష్కరించి ప్రతిని సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మలి సీడీని రచయిత సుద్దాల అశోక్ తేజకు అందించారు.నలుగురు కుర్రాళ్ల జీవితాలను ఏ యువతి ఎలా ప్రభావితం చేసిందనీ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కిందనీ, ఇందులోని ఆరు పాటలకు అద్భుతమైన స్పందన వస్తుందనీ నిర్మాత జ్యోతిప్రియ గుమ్ణం తెలిపారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాదించాలని అతిథులు అభిలషించారు. కెమెరామెన్ డి.ఆనందరావు, కొరియోగ్రాఫర్ ప్రసాద్, మైత్రి ఆడియో అధినేత శ్రీనాథ్, చిత్రయూనిట్ కు చెందిన పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment