ఏడాదికి ఒక చిత్రానికే పరిమితమవుతున్న యువహీరోల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏడాదిలో కనీసం రెండు చిత్రాలు రిలీజ్ అయ్యేలా తమ కొత్త ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకుంటున్నారు. యువహీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' చిత్రం భారీ అంచనాలతో ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం షూటింగ్ లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం' (గోవిందుడు అందరి వాడేలే) చిత్రం రెగ్యులర్ షూటింగ్ పొల్లాచిలో మొదలైంది. హీరో ఎన్టీఆర్, కథానాయిక కాజల్ పై ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పది రోజుల పాటు ఈ పాటను షూట్ చేస్తారు.
కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి ('మున్నా' ఫేమ్) తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, అజయ్ లతో పాటు శ్రీహరి ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగవలసి ఉంది. 2010 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రీలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందిస్తున్నారు.

No comments:
Post a Comment