విశ్వనాథ్ 'సముద్రం' సెట్స్ కు

తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచ దేశాలకు సైతం చాటిని కళాతపస్వి కె.విశ్వనాథ్ ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నారు. 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'స్వర్ణకమలం' వంటి ఎన్నో కళాఖండాలను అందించిన విశ్వనాథ్ చివరిసారిగా 'స్వరాభిషేకం' చిత్రానికి 2004లో దర్శకత్వం వహించారు. అందులో కీలక పాత్రను కూడా పోషించారు. శ్రీ రాజేశ్వరి కంబైన్స్ పతాకంపై సి.కౌసలేంద్రరావు ఆ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై కౌసలేంద్రరావు తన తదుపరి చిత్రాన్ని మళ్లీ విశ్వనాథ్ డైరెక్షన్ లో రూపొందించబోతున్నారు. దీనికి 'సముద్రం' అనే టైటిల్ నిశ్చయమైంది. ఈనెల 27న ఈ చిత్రం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో మొదలై తొలి షెడ్యూల్ జరుపుకోనుంది.అల్లరి నరేష్ ఈ చిత్రంలో కథానాయకుడు కాగా, ఆయనకు జోడిగా మంజరి ఫడ్నిస్ ఎంపికైంది. తొలుత ఈ చిత్రంలో మలయాళ నటి పద్మప్రియ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ కోట్ చేసిందట. ఈ క్రమంలో మంజరి ఫడ్నిస్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అల్లరి నరేష్ తో మంజరి నటించడం ఇది రెండోసారి. గతంలో ఆయనతో 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' చిత్రంలో నటించింది. హీరో రాజాతో కలిసి మంజరి నటిస్తున్న 'ఇంకోసారి' కూడా జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వనాథ్ వంటి దిద్గర్శకుని చిత్రంలో నటించే అవకాశం రావడంతో మంజరి ఎంతో థ్రిల్ ఫీలవుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. విశ్వనాథ్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండటం కూడా ఇదే ప్రథమం.

No comments:

Post a Comment