'బిగ్ సి' మరోసారి చేతులు మారింది. మొబైల్ రిలైట్ స్టోర్స్ జెయింట్ 'బిగ్ సి' బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్ ను గ్లామర్ నటి ఇలియానా అందిపుచ్చుకుంది. ఈ కంపెనీ తొలి బ్రాండ్ అంబాసిడర్ గా ఛార్మి, ఆ తర్వాత ఏడాది పాటు కాజల్ ఉన్నారు. కంపెనీ విస్తరణలో భాగంగా దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉన్న ఇలియానాను బ్రాండ్ అంబాసిడర్ గా ఈసారి ఎంచుకున్నారు. హైద్రబాద్ లోని తాజ్ బంజారాలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు ఇలియానా పాల్గొన్నారు. 'బిగ్ సి' అంబాసిడర్ కావడం చాలా సంతోషంగా ఉందని ఇలియానా ఈ సందర్భంగా పేర్కొంది.ఈ ఏడాది 'కిక్' చిత్రంతో హిట్ సాధించిన ఇలియానా 'రెచ్చిపో', 'సలీమ్' చిత్రాలతో తన గ్లామర్ కు మరింత పదునుపెట్టి యూత్ కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం మూడు చిత్రాలకు అగ్రిమెంట్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించనున్న 'శక్తి' చిత్రానికి ఇలియానా కమిట్ అయింది. జనవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది. 'దేవదాసు' ఫేమ్ రామ్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకట్ నిర్మించనున్న చిత్రంలోనూ ఇలియానా నటించనుంది. వీటికి తోడు తమిళంలో విక్రమ్ సరసన '24' చిత్రానికి కూడా ఇలియానా ఓకే చెప్పింది. ఫిబ్రవరిలో జరిగే రెండో షెడ్యూల్ లో ఇలియానా పాల్గొంటుంది.
No comments:
Post a Comment