కొన్ని చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచికి అవి అద్దంపడుతూ పలువురి ప్రశంసలు అందుకుంటూ ఉంటాయి. రాజా, తీర్థ, ఎల్బీ శ్రీరాం ముఖ్య పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్యావ్య ఫిలింస్ పతాకంపై వై.రవీంద్రబాబు, కె.బసిరెడ్డి నిర్మించిన 'సొంత ఊరు' చిత్రం ఈ కోవలోనిదే. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ హిట్ ను సాధించలేకపోయింది. నవంబర్ లో ముంబైలో జరిగిన ముంబై ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో తెలుగు నుంచి ప్రదర్శనకు వెళ్లిన ఏకైక చిత్రమిది. తాజాగా మరో చిత్రోత్సవవానికి కూడా ఈ సినిమా ఎంపికైంది. కేరళ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శనకు గాను 'సొంత ఊరు' ఎంపికైనట్టు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 80 సినిమాలు ఈ చిత్రోత్సవాలకు ఎంపికయ్యాయనీ, వాటిలో భారతదేశం నుంచి 20 సినిమాలు ఎంపిక కాగా, అందులో 'సొంత ఊరు' చిత్రం ఒకటి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈనెల 11 నుంచి 18 వరకూ కేరళలోని త్రివేండ్రంలో కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేరళ చలనచిత్ర అకాడమీ ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తోందనీ, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొంటారనీ చెప్పారు.

No comments:
Post a Comment