విష్ణు, ఇలియానా జంటగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో లక్ష్మీప్రసన్న పిక్చర్, రిలయెన్స్ బిగ్ సినిమా పతాలపై డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మిస్తున్న 'సలీమ్' (దుమ్ముదులుపుతాడు) చిత్రం భారీ అంచనాలతో ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుతోంది. దీనికంటే ఒక రోజు ముందే వరదల బాధితుల సహాయార్థం హైద్రాబాద్ లో ఈ చిత్రం చారిటీ షో ఏర్పాటు చేయనున్నారు.
విష్ణు ఆ వివరాలను తెలియజేస్తూ, పదవ తేదీ రాత్రి నిర్వహించే ఈ ఛారిటీ షో ద్వారా వచ్చే మొత్తాన్ని మహబూబన్ నగర్ జిల్లా రాజోలి గ్రామంలోని వరద బాధితుల సహాయార్థం వినియోగిస్తామని చెప్పారు. రాజోలి గ్రామాన్ని అదుకునేందుకు కోటి రూపాయలకు పైగా నిధులతో పునరావాస కార్యక్రమాలు చేపడతామని గతంలో హామీ ఇచ్చామనీ, అందులో భాగంగానే ఈ ఛారిటీ షో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తాను నటించిన చిత్ర ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు ఓ మంచి పనికి ఉపయోగపడుతుండటం సంతోషంగా ఉందన్నారు. లక్ష్మీప్రసన్న బ్యానర్ లో ఇంతవరకూ నిర్మించిన చిత్రాల కంటే అత్యధిక బడ్జెట్ తో (23 కోట్లు) ఈ చిత్రం రూపొందింది. విష్ణు ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడంతో పాటు రిస్కీ షాట్స్ కూడా చేసారు. మోహన్ బాబు నెగిటివ్ టచ్ ఉన్న డాన్ పాత్రలో వినోదాన్ని అందించబోతున్నారు. మరో స్పైసీ పాత్రలో కావేరీ ఝా నటించింది. 295 ప్రింట్లతో (102 డిజిటల్ ప్రింట్లతో సహా) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

No comments:
Post a Comment