బాణం' చిత్రం తర్వాత వైజయంతీ హౌస్ నుంచి త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శేషు ప్రియాంక నిర్మిస్తున్న 'ఓం శాంతి' ( చిత్రం ప్రొడక్షన్ దశ నుంచి మల్టీస్టారర్ చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నిడివి తక్కువగా ఉండే ఓ కీలకమైన పాత్రను తమిళ హీరో మాధవన్ పోషించనున్నారని తెలిసింది.
మాధవన్ తమిళ, హిందీ చిత్రాలతో పాటు 'సఖి', 'చెలి' వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానం కూడా చూరగొన్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని 'ఓం శాంతి' చిత్రంలోని ఓ పాత్రను మాధవన్ చేత చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనే విషయాన్ని చిత్ర నిర్మాతలు సీక్రెట్ గానే ఉంచుతున్నారు. రిలీజ్ తర్వాత వెండితెరపై ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ఉద్దేశం ఇందుకు కారణం కావచ్చు. '5 కథలు, 5 జీవితాలు, 1 నిజం' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో దర్శకుడు ప్రసాద్ (తొలి పరిచయం) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఈనెల 5న వినూత్న శైలిలో రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న 'ఓం శాంతి'ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:
Post a Comment