'గోలీమార్'లో ప్రియమణి

అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం 'గోలీమార్'లో హీరోయిన్ గా ప్రియమణిని ఫైనలైజ్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. తొలుత ఈ చిత్రానికి హన్సిక పేరు పరిశీలనలోకి వచ్చింది. 'దేశముదురు' చిత్రంతో హన్సికను పూరీ జగన్నాథ్ తెలుగు తెలుగు పరిచయం చేయడంతో ఈ ఆఫర్ ను హన్సిక అందిపుచ్చుకోనుందనే ప్రచారం జరిగింది. అయితే హన్సిక అడిగిన రెమ్యునరేషన్ తో పూరీ ఆ ఆలోచన విరమించుకున్నారట. ఓ దశలో దర్శకుడు తేజ 'కేక' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఇషానా పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఎట్టకేలకు ప్రియమణి ఎంపికకే దర్శకనిర్మాతలు మొగ్గుచూపినట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' చిత్రంలోనూ, జగపతిబాబు సరసన 'సాధ్యం' చిత్రంలోనూ ప్రియమణి నటిస్తోంది.ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర స్ఫూర్తితో 'గోలీమార్' చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించనున్నారు. ఇంతవరకూ ఎక్కువగా కొత్త దర్శకులతో మాత్రమే పనిచేసిన గోపీచంద్ తొలిసారి పూరీ వంటి అగ్రదర్శకుడితో పనిచేస్తుండటం విశేషం. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండటంతో పాటు ఆయన పాత్రలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. నాజర్, రోజా ఇంతవరకూ ఎంపికైన తారాగణం. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, విజయ్ పైట్స్, చక్రి సంగీతం అందిస్తున్నారు.a

No comments:

Post a Comment